Share News

ఇచ్ఛాపురం, నరసన్నపేటలో కుండపోత

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:45 PM

ఇచ్ఛాపురం, నరసన్నపేటలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతో ఉక్కపోతకు గురైన ప్రజలు ఒక్కసారి భారీ వర్షం పడడంతో కొంత ఉపశమనం పొందారు.

ఇచ్ఛాపురం, నరసన్నపేటలో కుండపోత
ఇచ్ఛాపురంలో వర్షపు నీటిలో వాహనదారుల ఇక్కట్లు

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం లో సోమవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతో ఉక్కపోతకు గురైన ప్రజలు ఒక్కసారి భారీ వర్షం పడడంతో కొంత ఉపశమనం పొందారు. భారీవర్షానికి రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వేచ్ఛావతి అమ్మవారి వీధిలో రోడ్లపై వర్షం నీరు ప్రవహించింది.

నరసన్నపేటలోనూ..

నరసన్నపేట, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటతోపాటు పరిసర గ్రామాల్లో సోమవారం సాయంత్రం కుండ పోత వర్షం కురి సింది. ఏకధాటి గా సుమారు రెండు గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పిడుగులు పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. గ్రామాల్లో భారీ వర్షాలకు వరదనీరు తంపర భూముల్లోకి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:45 PM