Share News

ఐదుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:54 PM

కాశీబుగ్గ పోలీస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి మూ డు వేర్వేరు కేసుల్లో ఐదుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 84.81 కిలోల గంజాయి స్వాధీ నం చేసుకున్నారు.

ఐదుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ సూర్యనారాయణ

  • మూడు వేర్వేరు కేసుల్లో 84.81 కిలోలు స్వాధీనం

పలాస, సెప్టెంబరు 21(ఆం ధ్రజ్యోతి): కాశీబుగ్గ పోలీస్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి మూ డు వేర్వేరు కేసుల్లో ఐదుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 84.81 కిలోల గంజాయి స్వాధీ నం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కా శీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ ఆదివారం విలేక రులకు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లా గోయిబంద గ్రామానికి చెందిన గంట జైశ్వా, అదే జిల్లా సర్గిగూడ గ్రామానికి చెందిన స్వప్న బిబ్హార్‌ సహజీవనం చేస్తున్నారు. బిబ్హార్‌కి కోడలి వరుస అయిన రింకు బిబ్హార్‌ గంజాయి పండిస్తూ మహారాష్ట్రలోని షోలాపూర్‌ ప్రాంతంలో అమ్ముతుం టుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో స్వప్న, జైశ్వాలకు గంజాయి తీసుకొని వెళ్లి షోలా పూర్‌లో ఉంటున్న మోహన్‌ రోహిదాస్‌కు ఇవ్వాల ని కోరింది. దీంతో 40.24 కిలోలు గంజాయి ప్యాకె ట్లు చేసి వారికి అప్పగించింది. దీన్ని తరలించేందు కు రూ.20వేలు ఇస్తామని చెప్పడంతో వారు గంజాయిని గుణుపూర్‌ నుంచి పలాస వరకూ బ స్సులో వచ్చి.. అక్కడి నుంచి పలాస రైల్వే స్టేషన్‌ కు వస్తుండగా తనిఖీలు చేస్తున్న ఎస్‌ఐ ఆర్‌.నర్సిం హమూర్తికి తారాసపడ్డారు. బ్యాగులు పరిశీలించ గా గంజాయి బయట పడింది. దీంతో వారిద్దర్నీ అరెస్టు చేసి మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు.

అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం విజయరా ఘవపురం, చెన్నైకు చెందిన గాయత్రి అనీఫ్‌, సు భాష్‌ అన్నాచెల్లెలు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన మమతాకుమారి గంజాయి పండిస్తూ బ్రోకర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. మగవారు గంజాయి తరలిస్తుంటే మన రాష్ట్రంలో నిరంతరం నిఘా ఉండడంతో ఆడవారితో గంజా యి రవాణాకు పథకం రచించారు. ఈ క్రమంలో అన్నా చెల్లెలు కలసి 28.86 కిలోల గంజాయిని చెన్నై తరలించేందుకు పర్లాకిమిడి నుంచి పలాస వెళ్లే బస్సులో వచ్చారు. శనివారం రాత్రి పలాస రై ల్వేస్టేషన్‌కు గంజాయితో వస్తుండగా కాశీబుగ్గ ఎస్‌ ఐ నర్సింహమూర్తికి వచ్చిన సమాచారం మేరకు ఇద్దర్నీ ప్రశ్నించడంతో గంజాయి బ్యాగులు బయట పడ్డాయి. వీరిని అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలిం చారు. వీరిని మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు.

ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కాంతాసురు గ్రామానికి చెందిన లలితమాఝి అనే మహిళ 15.71 కిలోల గంజాయి తరలిస్తు కాశీబుగ్గ ఎస్‌ఐ ఆర్‌.నర్సింహమూర్తికి శనివారం అర్ధరాత్రి పలాస రైల్వేస్టేషన్‌ రోడ్డులో పట్టుబడింది. కేంఝోర్‌కు చెం దిన సంజయ్‌కుమార్‌కు బెంగుళూరుకు చెందిన హేనాబేగం పరిచయం అయింది. వీరిద్దరు గతం లో ఒడిశా నుంచి గంజాయి తీసుకువెళ్లి ఆ ప్రాం తంలో అమ్మకాలు చేసేవారు. మహిళయితే ఎటు వంటి అనుమానాలు లేకుండా గంజాయి సులభం గా తీసుకురావచ్చనే అత్యాసతో లలితమాఝికి ఉసుగొలిపి గంజాయి ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీల్లో ఆమె పట్టుబడింది. మొత్తం మూడు కేసుల్లో సంబంధించి ఐదురు గురిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు.

Updated Date - Sep 21 , 2025 | 11:54 PM