Share News

పిస్టల్‌తో ఐదుగురి అరెస్టు

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:45 AM

ఒక పిస్టల్‌, మ్యాగ్‌జైన్‌ బాక్స్‌తో ఐదుగురుని శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి తెలిపారు.

పిస్టల్‌తో ఐదుగురి అరెస్టు

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఒక పిస్టల్‌, మ్యాగ్‌జైన్‌ బాక్స్‌తో ఐదుగురుని శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇందుకు సంబం ధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆదివారం ఉదయం రూరల్‌ ఎస్‌ఐ రాము తన సిబ్బందితో కలిసి ఓ మహిళ హత్య కేసులో దర్యాప్తు చేస్తుండగా.. తండ్యేంవలస వద్ద గల ఆర్టీవో కార్యాలయ సమీపంలో ఉన్న జగనన్న కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఐదుగురు వ్యక్తులు ఉండడాన్ని గమనించా రు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వారి నుంచి పిస్టల్‌, ఒక మ్యాగ్‌జైన్‌ బాక్స్‌ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా ప్రధాన నిందితుడు ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామానికి చెందిన పంచిరెడ్డి కైలాస్‌ గతంలో మరణించిన ఎచ్చెర్ల మండలానికి చెందిన సత్తారు గోపితో కలిసి నేరాలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఒడిశాలోని బరంపురం గ్రామానికి చెందిన సంతోష్‌ నుంచి పిస్టల్‌, మ్యాగ్‌జైన్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు శ్రీకాకుళంలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన దండాసి కార్తీక్‌కు వీటిని కైలాస్‌ విక్రయించాడు. మళ్లీ ఇప్పుడు కార్తీక్‌ నుంచి వాటిని కొనుగోలు చేసేం దుకు కైలాస్‌ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వాటిని తీసుకునేం దుకు ఆర్టీవో కార్యాలయ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలోని ఓ ఇంటికి తన స్నేహితులైన గుజరాతీపేటకు చెందిన అలమాన మణి, శ్రీకాకుళం మండలం పెద్దపాడుకు చెందిన బలగ ఉమామహేశ్వరరావు, కోటబొమ్మాళి మండలం నారాయణవలసకు చెందిన ఉర్జాన ప్రశాంత్‌కుమార్‌తో వెళ్లాడు. అక్కడే కార్తీక్‌ నుంచి పిస్టల్‌ తీసు కుంటున్న సమయంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీరు పట్టుబడ్డారని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ వ్యవహారంలో ఉన్నవారిని అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు.

Updated Date - Dec 22 , 2025 | 12:45 AM