Share News

మంగోలియాలో చిక్కుకున్న మత్స్యకారుడు

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:51 PM

లక్కివలస పంచాయతీ పిట్టవానిపేట గ్రామానికి చెందిన తూలు గారయ్య(37) అనే మత్స్యకారుడు మంగోలియా దేశంలో చిక్కుకున్నాడు.

మంగోలియాలో చిక్కుకున్న మత్స్యకారుడు
గారయ్య(ఫైల్‌)

-రక్షించాలని కోరుతున్న కుటుంబ సభ్యులు

సంతబొమ్మాళి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): లక్కివలస పంచాయతీ పిట్టవానిపేట గ్రామానికి చెందిన తూలు గారయ్య(37) అనే మత్స్యకారుడు మంగోలియా దేశంలో చిక్కుకున్నాడు. ఈ ఏడాది మే 15వ గారయ్య పెయింటర్‌ ఉద్యోగం కోసం మంగోలియా వెళ్లాడు. అక్కడ మెగా ఇంజనీరింగ్‌ కంపెనీలో చేరాడు. అగ్రిమెంట్‌ పూర్తవడంతో ఇండియా వచ్చేందుకు ఈ నెల 7న మంగోలియా యులాన్‌ బటార్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా అక్కడ ఆయన్ను పోలీసులు అరెస్టు చేసినట్లు కంపెనీ మేనేజర్‌ బాజీ నుంచి ఆదివారం తమకు సమాచారం వచ్చిందని గారయ్య భార్య ఎర్రమ్మ తెలిపింది. అరెస్టుకు కారణాలను తెలియజేయలేదని రోదిస్తుంది. తమ భర్తను స్వదేశానికి క్షేమంగా రప్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును ఆమె కోరింది.

Updated Date - Nov 09 , 2025 | 10:51 PM