Share News

చెన్నైలో ఇసుకలపాలెం మత్స్యకారుడు మృతి

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:23 AM

ఇసుకలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు నీలకంఠం (32) చెన్నై కాశినీడు ప్రాంతంలో మంగళవారం మృతి చెందినట్టు ఆ గ్రామ పెద్ద బైపల్లి ఈశ్వరరావు తెలిపారు.

చెన్నైలో ఇసుకలపాలెం మత్స్యకారుడు మృతి

సోంపేట రూరల్‌, ఆగస్టు 5(ఆంద్రజ్యోతి): ఇసుకలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు నీలకంఠం (32) చెన్నై కాశినీడు ప్రాంతంలో మంగళవారం మృతి చెందినట్టు ఆ గ్రామ పెద్ద బైపల్లి ఈశ్వరరావు తెలిపారు. కుటుంబ సభ్యులు, ఆయన తెలిపిన వివరాల మేరకు.. నీలకంఠం చెన్నైకు వలసవెళ్లి చేపల వేట సాగిస్తూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. గత ఏప్రిల్‌లో గ్రామానికి వచ్చి మళ్లీ చెన్నై వెళ్లాడు. రెండు రోజుల కిందట పది మంది మత్స్యకారులతో కలిసి సముద్రంలో వేట సాగిస్తుండగా.. ప్రమాదవశాత్తూ బోటు నుంచి జారిపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ని తోటి మత్స్యకారులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలకం ఠానికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకురాలేక అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటిపెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:23 AM