Share News

Fisherman Death : చేపలవేటకు వెళ్లి.. మత్స్యకారుడి మృతి

ABN , Publish Date - May 25 , 2025 | 11:27 PM

Fishing trip Tragedy పోలాకి మండలం రాజారాంపురానికి చెందిన దవులపిల్లి గురుమూర్తి(52).. గ్రామానికి సమీపంలో ఉన్న వంశధార ఉప్పుగెడ్డలో చేపలవేటకు వెళ్లి మృతి చెందాడు. శనివారం రాత్రి చిన్నపడవతో గురుమూర్తి వంశధార ఉప్పుగెడ్డలో చేపలవేటకు వెళ్లాడు. ఎప్పటికీ బయటకు రాకపోవడంతో తోటి మత్స్యకారులు గాలించారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో గురుమూర్తి విగతజీవిగా కనిపించాడు.

Fisherman Death : చేపలవేటకు వెళ్లి.. మత్స్యకారుడి మృతి
గురుమూర్తి మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య నీలవేణి, కుటుంబ సభ్యులు

  • రాజారాంపురంలో విషాదం

  • పోలాకి, మే 25(ఆంధ్రజ్యోతి): పోలాకి మండలం రాజారాంపురానికి చెందిన దవులపిల్లి గురుమూర్తి(52).. గ్రామానికి సమీపంలో ఉన్న వంశధార ఉప్పుగెడ్డలో చేపలవేటకు వెళ్లి మృతి చెందాడు. శనివారం రాత్రి చిన్నపడవతో గురుమూర్తి వంశధార ఉప్పుగెడ్డలో చేపలవేటకు వెళ్లాడు. ఎప్పటికీ బయటకు రాకపోవడంతో తోటి మత్స్యకారులు గాలించారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో గురుమూర్తి విగతజీవిగా కనిపించాడు. దీంతో భార్య నీలవేణి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌, సీఐ ఎం.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కాగా ప్రమాదం ఎలా జరిగిందో తెలియదని కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీటీసీ, మైలపల్లి త్రినాథరావు, కొమర ఎర్రయ్య, కోడ తాతారావు తదితర మత్స్యకారులు తెలిపారు. బోటు బోల్తా పడి ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహానికి వీఆర్వో వై.లక్ష్మణరావు, సాగరమిత్ర పుష్పలత, సచివాలయ సిబ్బంది గ్రామపెద్దల సమక్షంలో పంచనామా చేశారు. పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - May 25 , 2025 | 11:27 PM