Share News

పడవ బోల్తాపడి మత్స్యకారుడి మృతి

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:24 AM

అప్పటి వరకు తమతో ప్రయాణించి చేపల వేట చేసిన వ్యక్తి విగతజీవిగా మారడాన్ని తోటి మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పడవ బోల్తాపడి మత్స్యకారుడి మృతి
రోదిస్తున్న కుటుంబ సభ్యులు, గజేంద్ర (ఫైల్‌)

- క్షేమంగా ఒడ్డుకు చేరిన మరో నలుగురు

- బందరువానిపేట తీరంలో ఘటన

గార/రూరల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అప్పటి వరకు తమతో ప్రయాణించి చేపల వేట చేసిన వ్యక్తి విగతజీవిగా మారడాన్ని తోటి మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని.. ఇక తమ కు దిక్కెవరంటూ మృతుడి భార్య రోదిస్తున్న తీరు అందరినికంటతడి పెట్టించింది. పొట్టకూ టి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు బోటు బోల్తాపడడంతో మృతి చెందిన ఘటన బందరు వానిపేట గ్రామంలో బుధవారం చోటు చేసు కుంది. గార ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజు తెలిపి న వివరాల ప్రకా రం.. బందరు వానిపేటకు చెం దిన బడి గజేంద్ర (55), పుక్కల కృష్ణ, గుళ్ల ప్రసాద్‌, పుక్కల లక్ష్మణ, మైలపిల్లి సూర్యనారాయణ కలిసి పడవపై బుధవారం వేకువజామున చేపలవేటకు సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకొని తిరిగి వస్తుండగా అలల ఉధృతికి పడవ బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న వారంతా నీటిలోకి పడిపోయారు. ఐదుగురూ సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుకు వస్తున్న సమయంలో గజేంద్రకు ఆయాసం వచ్చింది. దీంతో ఈదలేక మునిగిపోవడాన్ని మిగతా మత్స్యకారులు గమనించారు. అతను ఉన్న ప్రదేశానికి వెళ్లి నీటిలో మునిగిపోయిన గజేంద్రను బయటకు తీసి చూసేసరికి ప్రాణంపోయింది. గజేంద్ర మృతదేహాన్ని పట్టుకొని ఈదుతూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గజేంద్రకు భార్య పోలమ్మ, ముగ్గురు కుమార్తెలతోపాటు దివ్యాంగుడైన కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం అయింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మృతుడి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

శ్రీకాకుళం, జూలై 23(ఆంధ్రజ్యోతి): చేపల వేటకు వెళ్లి మృతి చెందిన బందరువానిపే టకు చెందిన మత్స్యకారుడు బడి గజేంద్ర కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో గజేంద్ర కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు, మత్స్యశాఖ నుంచి రూ.5లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని.. ఈవిషయమై అవగా హన కార్యక్రమాలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. కుటుం బంలో పెద్ద దిక్కును కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి భరోసా ఇచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణం స్పందించి సాయం చేశారని తెలిపారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Updated Date - Jul 24 , 2025 | 12:24 AM