Share News

AMC : తొలిసారిగా మహిళకు అవకాశం

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:43 PM

amc chairperson నరసన్నపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కంబకాయి గ్రామానికి చెందిన పోగోటి ఉమామహేశ్వరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె గతంలో సర్పంచ్‌గానూ, టీడీపీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.

AMC : తొలిసారిగా మహిళకు అవకాశం
పోగోటి ఉమామహేశ్వరి, తర్ర బలరామ్‌

  • - నరసన్నపేట ఏఎంసీ చైర్‌పర్సన్‌గా పోగోటి ఉమామహేశ్వరి

  • నరసన్నపేట, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కంబకాయి గ్రామానికి చెందిన పోగోటి ఉమామహేశ్వరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె గతంలో సర్పంచ్‌గానూ, టీడీపీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1992లో నరసన్నపేట మార్కెట్‌ కమిటీ ఏర్పాటు కాగా.. ఇప్పటివరకూ అందరూ పురుషులే చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా మహిళకు చైర్‌పర్సన్‌ బాధ్యత అప్పగించడం గమనార్హం.

  • ఉమామహేశ్వరి టీడీపీలో క్రీయాశీలంగా వ్యవహరిస్తూ.. ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ తెలుగు మహిళ కార్యదర్శిగా, గ్రామ పార్టీ అధ్యక్షురాలిగా, బూత్‌ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు, ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై మండల సమావేశాల్లో ఆమె ప్రశ్నిస్తూ.. తగిన ఆధారాలతో పోరాటం చేసేవారు. రెబల్‌ మహిళా లీడర్‌గా గుర్తింపు పొందారు. మండల తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, కంబకాయి గ్రామ సర్పంచ్‌గా మూడు పర్యాయాలు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా సర్పంచుల సంఘం ట్రెజరర్‌గా కూడా ఆమె పనిచేశారు. భర్త అప్పలనాయుడు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించేవారు. ఉద్యోగ విరమణ తర్వాత దంపతులిద్దరూ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. వారి సేవలకు గుర్తింపుగా మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పదవి రావడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం చేశారు.

  • ఉమామహేశ్వరి, అప్పలనాయుడు మాస్టారు మాట్లాడుతూ.. ‘రైతులకు మార్కెట్‌ కమిటీ సేవలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. తమపై నమ్మకంతో పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, నారా లోకేశ్‌, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చనకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.

  • జలుమూరు ఏఎంసీ చైర్మన్‌గా తర్ర బలరామ్‌

    జలుమూరు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జలుమూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా తర్ర బలరామ్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన తర్ర బలరామ్‌ టీడీపీ ఆవిర్భావం నుంచీ కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈయన భార్య మాణిక్యం శ్రీముఖలింగం సర్పంచ్‌గా 2013 నుంచి 2018 వరకు పనిచేశారు. తన సేవలకు గుర్తింపుగా పదవి కట్టబెట్టేందుకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి బలరామ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. బలరామ్‌కు పదవి దక్కడంపై టీడీపీ నేతలు వెలమల రాజేంద్రనాయుడు, బగ్గు గోవిందరావు, దుంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, పి.దాలయ్య, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, కత్తిరి వెంకటరమణ, ధర్మాన తేజకుమార్‌, సురవరపు తిరుపతిరావు, పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 04 , 2025 | 11:43 PM