Share News

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:02 AM

ఏచిన్న అగ్నిప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రాఽథమికంగా అదుపు చేసే నైపుణ్యత కలిగి ఉండాలని అగ్ని మాపకశాఖ అధికారి బి.సోమేశ్వరరావు తెలిపారు.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
పలాస: మంటలను ఏ విధంగా అదుపు చేయాలో పవర్‌గ్రిడ్‌ సిబ్బందికి వివరిస్తున్న అగ్నిమాపకశాఖ అధికారులు:

పలాస,ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి):ఏచిన్న అగ్నిప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రాఽథమికంగా అదుపు చేసే నైపుణ్యత కలిగి ఉండాలని అగ్ని మాపకశాఖ అధికారి బి.సోమేశ్వరరావు తెలిపారు. స్థానిక రామకృష్ణాపురం వద్ద ఉన్న పవర్‌గ్రిడ్‌ సిబ్బందికి కాశీబుగ్గ అగ్నిమాపకశాఖ అధికారులు అగ్రిప్రమా దాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ పంపిణీకేంద్రంలో పనిచేసే సిబ్బందికి ప్రమాదాలు జరిగితే ఏ విధంగా వాటినుంచి కాపాడుకోవాలో అవగాహన అవసరమన్నారు.కార్యక్రమంలో సిబ్బం ది డి.భాస్కరరావు, కె.యుగంధర్‌, పి.మన్మఽథరావు, ఎ.సుదర్శనరావు పాల్గొన్నారు.

ఫపోలాకి,ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని చల్లబంద, వెదుళ్లవలస,బెలమర పెట్రోల్‌ బంకుల వద్ద నిర్వాహకులకు అగ్నిప్రమాదాలు జరిగే సమ యంలో తీసుకోవల్సిన చర్యలపై నరసన్నపేట అగ్నిమాపక అధికారి ఎస్‌.వరహాలు ఆధర్యంలో సిబ్బంది అవగాహన కల్పించారు.

ఫకొత్తూరు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి):కొత్తూరులోని పెట్రోల్‌ బంకులో అగ్ని ప్రమాదాలనివారణపై అగ్నిమాపకకేంద్రం అధికారి బుచ్చోడు అవగాహన కల్పిం చారు.ప్రమాదాలుజరిగే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించారు.

Updated Date - Apr 19 , 2025 | 12:02 AM