Share News

బ్యాటరీ బైక్‌ షోరూంలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Nov 17 , 2025 | 12:57 AM

రాగోలు గ్రామంలో ఏడీఎంఎస్‌ ఎలక్ట్రికల్‌ బైక్‌ షోరూంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది.

బ్యాటరీ బైక్‌ షోరూంలో అగ్ని ప్రమాదం
వాహనాలు కాలిపోయిన దృశ్యం

శ్రీకాకుళం రూరల్‌, నవంబరు 16 ( ఆంధ్రజ్యోతి): రాగోలు గ్రామంలో ఏడీఎంఎస్‌ ఎలక్ట్రికల్‌ బైక్‌ షోరూంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి షోరూంలో బైక్‌లకు వ్యాపించాయి. దీంతో సుమారుగా 13 కొత్త ఎలక్ర్టికల్‌ వాహనాలు మంటల్లో కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు శ్రీకాకుళం నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంట లను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని ఎస్‌ఐ కె.రాము తెలిపారు.

Updated Date - Nov 17 , 2025 | 12:58 AM