Share News

శ్రీ చైతన్య కళాశాలలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Jul 05 , 2025 | 11:57 PM

నగరంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద ఉన్న శ్రీ చైతన్య కళాశాల భాను టవర్స్‌ బ్రాంచ్‌లో శనివారం సాయం త్రం అగ్ని ప్రమాదం సంభవించింది.

 శ్రీ చైతన్య కళాశాలలో అగ్ని ప్రమాదం
షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయిన ప్యానెల్‌ బాక్సు

త్రుటిలో తప్పిన ముప్పు

శ్రీకాకుళం క్రైం, జూలై 5(ఆంధ్ర జ్యోతి): నగరంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద ఉన్న శ్రీ చైతన్య కళాశాల భాను టవర్స్‌ బ్రాంచ్‌లో శనివారం సాయం త్రం అగ్ని ప్రమాదం సంభవించింది. కళాశాల గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఎలక్ర్టి కల్‌ ప్యానెల్‌ బాక్సు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమ నించిన కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకురాలు చాకచక్యంగా వ్యవహరిం చి మెయిన్‌ బాక్సు వద్ద ఉన్న మెయిన్‌ స్విచ్‌ ఆపి వేయడంతో మంటలు వ్యాపించకుండా నివారిం చగలిగారు. ఇదేక్రమంలో మరికొందరు సిబ్బంది స్పందించి ఇసుక బకెట్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ కళాశాలలో సుమారు 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంటలు ఎక్కువగా చెలరేగితే పెద్ద ప్రమా దమే జరిగేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తినష్టం జరగలేదని అగ్నిమాపకశాఖ ఏడీ శ్రీనుబాబు తెలిపారు.

Updated Date - Jul 05 , 2025 | 11:57 PM