రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధించాలి: జేసీ
ABN , Publish Date - May 17 , 2025 | 11:46 PM
నరసన్నపేటలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, రోడ్డుపై చెత్త వేసిన వ్యాపారులపై జరిమాన విధించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. శనివారం నరసన్నపేట పంచాయతీకార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పథకం వేతనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.
నరసన్నపేట, మే 17(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, రోడ్డుపై చెత్త వేసిన వ్యాపారులపై జరిమాన విధించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. శనివారం నరసన్నపేట పంచాయతీకార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పథకం వేతనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన నరసన్నపేటలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంపై అసహనం వ్యక్తంచేశారు. కాగా లెప్పర్సీకాలనీ చెందిన పలువురు తాగునీరు రావడంలేదని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం మడపాంలో ఓ రైస్ మిల్లును తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో మధుసూదనరావు, సర్పంచ్ శంకరరావు, ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, ఈవో ద్రాక్షాయిణి పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
పలాస, మే 17(ఆంధ్రజ్యోతి):ప్రతిఒక్కరూ మొక్కలునాటి పర్యావరణ పరిక్షణకు తోడ్పాటు అందించాలని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు కోరారు. స్థానిక కిడ్నీ పరిశోధన కేంద్రం,200 పడకల ఆసుపత్రి వద్ద స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు.
పని ప్రదేశంలో టెంట్లు ఏర్పాటుచేయాలి
పాతపట్నం, మే 17(ఆంధ్రజ్యోతి):ఉపాధి వేతనదారులకోసం పని ప్రదే శంలో టెంట్లుఏర్పాటు చేయాలని మండల ప్రత్యేకాధికారి మంచు కరుణా కరావు తెలిపారు.మండలంలోని కొరసవాడలో ఉపాధి వేతనదారులతో స్వచ్ఛాంధ్ర,స్వర్ణాంధ్ర కార్యక్రమంలోభాగంగా పారిశధ్యంపై ప్రతిజ్ఞ చేయిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకుమారి, డీటీ ప్రసాదరావు, సర్పంచ్ ఉమాదేవి, కార్యదర్శి కృష్ణంరాజు పాల్గొన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జలుమూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో కె.అప్పలనాయుడు కోరారు. శీముఖలింగంలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జలుమూరులో తహసీల్దార్, మండలపరిషత్ కార్యాలయాల చుట్టు పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రం చేశారు.కార్యక్రమంలో తహసీల్దార్ జె.రామారావు, ఆర్‌ఐ కిరణ్, మండలసర్వేయర్ తర్ర నాగేశ్వరరావు,ఈవోపీఆర్డీ ఉమా మహేశ్వరరావు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.