Share News

‘స్త్రీశక్తి’తో మహిళలకు ఆర్థిక భరోసా

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:20 AM

స్త్రీశక్తి పథకం అమలుతో మహిళలకు ఆర్థిక భరోసా లభి స్తుందని టీడీపీ నాయకులు అన్నారు.

‘స్త్రీశక్తి’తో మహిళలకు ఆర్థిక భరోసా
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు

పాతపట్నం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): స్త్రీశక్తి పథకం అమలుతో మహిళలకు ఆర్థిక భరోసా లభి స్తుందని టీడీపీ నాయకులు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వగృహం వద్ద స్త్రీశక్తి పథకం విజయోత్సవ సభను శనివారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం నీల మణిదుర్గ ఆలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఎమ్మెల్యే గోవిందరావు పేరిట ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం సభా స్థలిలో టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల టీటీపీ అధ్యక్షులు, పీఏసీఎస్‌, ఏఎంసీ అధ్యక్షులు సలాన మోహనరావు, లోతుగెడ్డ తులసీ వరప్రసాద్‌, పైల బాబ్జీ, మామిడి రామకృష్ణ పిన్నింటి గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:20 AM