అర్హులందరికీ ఆర్థిక సాయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:53 PM
అర్హులందరికీ సీఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థికసాయం చేయనున్నట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీచేశారు.
పాతపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సీఎంఆర్‌ఎఫ్ కింద ఆర్థికసాయం చేయనున్నట్లు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీచేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైల బాబ్జీ, సైలాడ సతీష్, యరపత్ని సంతోష్, అక్కంధ్ర సన్యాసిరావు పాల్గొన్నారు. కాగా ఇటీవల అమరావతిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో తనగళాన్ని వినిపించి ఆకట్టుకొన్న హిరమండలం మండలంలోని గులుమూరు జడ్పీ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి జర్జన ప్రవీణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తన కార్యాలయంలో అభినందించారు.