‘మొంథా’ బాధితులకు ఆర్థిక సాయం
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:59 PM
మొంథా తుఫాన్‌కు సంబంధించి డి. మత్స్యలేశం గ్రామం లోని 53 మంది బాధితులకు ప్రభు త్వం మంజూరు చేసిన రూ.1,000 వంతున ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు గురువారం అంజేశారు.
ఎచ్చెర్ల, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌కు సంబంధించి డి. మత్స్యలేశం గ్రామం లోని 53 మంది బాధితులకు ప్రభు త్వం మంజూరు చేసిన రూ.1,000 వంతున ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు గురువారం అంజేశారు. ఈ కుటుంబాలకు 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను ఒకటి, రెండు రోజల్లో అందజేస్తామన్నారు. డి.మత్స్యలేశం, బడివానిపేట, బుడగట్లపాలెం తదితర గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుం బాలకు అదనంగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీఎం ఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, తహసీ ల్దార్ బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం చేయండి
కవిటి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తు ఫాన్ ప్రభావంతో గ్రామాల్లో నష్టపోయిన బాధితు లందరికీ న్యాయం చేయాలని ఎమ్మెల్యే, విప్ బెందాళం అశోక్ అన్నారు. రామయ్యపుట్టుగలో తన స్వగృహంలో ఇచ్ఛాపురం, కవిటి మండల రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్షించారు. తుఫాన్ వల్ల ఆధికశాతం వర్షాలు కురవ డంతో నష్టం జరిగిన అన్ని అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇళ్లు కోల్పోయిన వారి జాబితాను తయారు చేసి వారికి సాయం త్వరితగతిన పంపిణీ చేయాల న్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు బి.మురళీ మోహన్, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.