Share News

AMC Chairman: చెరో రెండు

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:09 AM

AMC appointments చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న వ్యవసా య మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌, చైర్‌పర్సన్‌ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఈమేరకు జాబితాను గురువారం రాత్రి విడుదల చేసిం ది. జిల్లాలో మొత్తం నాలుగు మార్కెట్‌ కమిటీలకుగానూ టీడీపీ, జనసేన పార్టీల్లో చెరో ఇద్దరికి చొప్పున నామినేట్‌ చేసింది.

 AMC Chairman: చెరో రెండు
జనసేన : జ్యోత్స్న(శ్రీకాకుళం), రామకృష్ణారావు (హిరమండలం) టీడీపీ : విజయలక్ష్మి (కంచిలి), గౌరమ్మ (పాతపట్నం)

  • ఏఎంసీ చైర్మన్‌, చైర్‌పర్సన్‌ పదవుల భర్తీ

  • టీడీపీ, జనసేన పార్టీకి కేటాయింపు

  • శ్రీకాకుళం, జూలై 17(ఆంధ్ర జ్యోతి): చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న వ్యవసా య మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌, చైర్‌పర్సన్‌ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఈమేరకు జాబితాను గురువారం రాత్రి విడుదల చేసిం ది. జిల్లాలో మొత్తం నాలుగు మార్కెట్‌ కమిటీలకుగానూ టీడీపీ, జనసేన పార్టీల్లో చెరో ఇద్దరికి చొప్పున నామినేట్‌ చేసింది. నలుగురిలో ముగ్గురి మహిళలకు అవకాశం కల్పించింది.

  • శ్రీకాకుళం ఏఎంసీ చైర్‌పర్సన్‌ పదవి ‘జనసేన’కు లభించింది. శ్రీకాకుళం నగరానికి చెం దిన మామిడి విష్ణు సతీమణి దారపు జ్యోత్స్నకు ఈ పదవి కేటాయించారు. ఈమె స్వస్థలం పాతపట్నం నియోజకవర్గం. డిగ్రీ కంప్యూటర్స్‌ చదివారు.

  • కంచిలి(సోంపేటతో కలిపి) ఏఎంసీ చైర్‌పర్సన్‌ పదవిని కంచిలి మండలానికి చెందిన మద్దిల విజయలక్ష్మికి కేటాయించారు. ఈమె భర్త నాగేశ్వరరావు కంచిలి మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాకన్నపురం సర్పంచ్‌గాను మూడుసార్లు ఎన్నికయ్యారు. వీరికి ఇద్ద రు కుమారులు.

  • పాతపట్నం ఏఎంసీ చైర్‌పర్సన్‌ పదవిని మెళియాపుట్టి మండలంలో టీడీపీకి చెందిన చిన్నింటి గౌరమ్మకు కేటాయించారు. టీడీపీ నుంచి ఆశించినవారికే ఈ పదవి దక్కడంతో ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • హిరమండలం ఏఎంసీ చైర్మన్‌ పదవిని జనసేన పార్టీకి చెందిన మామిడి రామకృష్ణా రావుకు కేటాయించారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఆయన అభినందనలు తెలిపారు.

Updated Date - Jul 18 , 2025 | 12:09 AM