రోడ్డుపై గోతులను పూడ్చండి
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:44 PM
పాత బస్టాండ్ జంక్షన్‌లో ఎర్రన్న కూడలి వద్ద రోడ్డుపై ఉన్న గోతులతోను ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతు న్నాయని, వెంటనే వాటిని పూడ్చా లని 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఆశి లీలారాణి తదితర సభ్యులు కోరారు.
- మున్సిపల్ సమావేశంలో కోరిన సభ్యులు
ఇచ్ఛాపురం, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి): పాత బస్టాండ్ జంక్షన్‌లో ఎర్రన్న కూడలి వద్ద రోడ్డుపై ఉన్న గోతులతోను ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతు న్నాయని, వెంటనే వాటిని పూడ్చా లని 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఆశి లీలారాణి తదితర సభ్యులు కోరారు. శుక్ర వారం మునిసిపల్ కౌన్సిల్ హాల్‌లో చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన మునిసిపల్ సాదారణ సమావేశం జరిగింది. అజెండాలో పొందుపరిచిన ఆరు అంశాలను సభ్యులు ఆమోదించారు. 2025 అక్టోబరు 1 నుంచి 31 వరకు మునిసిపాల్టీ ఆదాయం, వ్యయాన్ని కౌన్సిల్ ఆమోదించింది. జీరో అవర్‌లో పలు అంశాలకు సంబంధించి అధికారులను కౌన్సిల్ సభ్యులు నిలదీశారు. బస్టాండ్ జంక్షన్‌లో గోతులను పూడ్చాలని ఫిర్యాదుచేసి నెలలు గడు స్తున్నా ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించా రు. దీనిపై చైరపర్స్‌న్ మా ట్లాడుతూ.. ఇదివరకే గోతులు పూడ్చాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు చెప్పినా స్పందించలేదని, మరోసారి చెబుతామని అన్నారు. 23 వార్డుల్లో ఆవులు, కోతులు, కుక్కల బెడద కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని వైస్‌చైర్‌ప ర్సన్లు లాభాల స్వర్ణమణి, ఉలాల భారతి దివ్య అధికారులను కోరారు. 2024లో డంపింగ్ యార్డు కోసం రూ.24లక్షలు మంజూరయ్యా యని, ఆ నిధులు ఏమయ్యాయని 23వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్ ప్రశ్నించారు. సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.