ఆర్టీసీ బస్సులో కొట్లాట
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:25 AM
నౌగాం నుంచి టెక్కలి వస్తున్నా ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో గురువారం ఉదయం కొ ట్లాట జరిగింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
టెక్కలి రూరల్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): నౌగాం నుంచి టెక్కలి వస్తున్నా ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో గురువారం ఉదయం కొ ట్లాట జరిగింది. దీనికి సంబంధించిన వీడి యో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతుం ది. ఈ క్రమంలో సీట్ల కోసం తగదాలు జరు గుతున్నాయి. ఇటీవల విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా, ఓ వ్యక్తి తగదాపడడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టెక్కలికి చెంది మహిళా, మరో విద్యార్థి సీట్ కోసం తగదాపడి జుత్తులు పట్టు కొని లాగుకోవడం కనిపించింది. తరచూ ఇటువంటి ఘటనలు జరుగు తుండడంతో ప్రభుత్వం ప్రాత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.