Share News

పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే పోరాటం

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:04 AM

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే పోరాటం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు.

పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే పోరాటం
కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపడుతున్న సీపీఐ నాయకులు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే పోరాటం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌ వద్ద రైతు సమస్యలపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఖరీఫ్‌ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, 6.70 కోట్ల గోనుసంచులు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం చెప్పినా ఆ దిశలో చర్యలు లేవన్నారు. తేమశాతం అధికంగా ఉందని, ధాన్యం రంగు మారాయనిన్న కారణాలతో ధాన్యం కొనుగోలులో కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మొక్క జొన్న అమ్మకాల్లో కూడా రైతులు క్వింటాలుకు రూ.800 వర కు నష్టపోతున్నారన్నారు. ధాన్యం, మొక్కజొన్న. పత్తి పంట లకు ప్రభుత్వం బోనస్‌ కలిపి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, కొన్న శ్రీనివాస్‌, సంతోష్‌, హరికృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:04 AM