Field observation పరిహారం చెల్లింపుల్లో తేడాలపై క్షేత్రస్థాయి పరిశీలన
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:39 PM
Field observation చల్లవానిపేట కూడలి నుంచి గ్రామం వరకు చేపడుతున్న రోడ్డు విస్తర ణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపుల్లో హెచ్చు తగ్గులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక అందించనున్నట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.లావణ్య తెలిపారు.
జలుమూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): చల్లవానిపేట కూడలి నుంచి గ్రామం వరకు చేపడుతున్న రోడ్డు విస్తర ణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపుల్లో హెచ్చు తగ్గులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక అందించనున్నట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.లావణ్య తెలిపారు. పరిహారం చెల్లింపులో తేడాలు న్నాయని బాధితులిచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తు న్నామని చెప్పారు. అప్పట్లో జాతీయ రహదారి అధికారులు గుర్తించిన నష్ట పరిహారం జాబితాను అవార్డు చేశామన్నారు. అందులో వచ్చిన హెచ్చు తగ్గులపై వాస్తవాలు తెలుసుకుంటున్నామన్నారు. తేడాలుంటే లబ్ధిదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసకుంటామన్నారు. తహసీల్దార్ రామారావు, భూ విభాగం డీటీ సంతోష్‌కుమార్, హైవే డీఈ సత్యభాస్కర్, జేఈ రఘు, సర్పంచ్‌లు రామచంద్రరావు, స్వామిబాబు తదితరులు పాల్గొన్నారు.