Share News

గర్భస్థ లింగ నిర్ధారణ నేరం

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:27 PM

గర్భస్థ శివు లింగ నిర్థారణ చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో డా.కె.అనిత స్పష్టం చేశారు.

గర్భస్థ లింగ నిర్ధారణ నేరం
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డా.అనిత

పాత శ్రీకాకుళం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గర్భస్థ శివు లింగ నిర్థారణ చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో డా.కె.అనిత స్పష్టం చేశారు. లింగ ఆధారిత హింస నివారణ, మెడికల్‌ లీగల్‌ కేర్‌పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీహెచ్‌ సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, సామాజిక, ఏరియా ఆసుప త్రుల వైద్యాధికారులకు బుధవారం ఒకరోజు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీపీఎన్‌డీటీ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయా లని, ఈ చట్టాన్ని ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవ న్నారు. హింసకు లోనైన అనాథ పిల్లలను గుర్తించి, వారిని శివు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రాలకు తర లించాలని ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్‌ డా.ఎన్‌.కల్యాణ్‌ బాబు మాట్లాడుతూ.. సమాజంలో ఆడ, మగ సమానమేనని, మహి ళలకు విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, సామాజిక గౌరవం, చట్టపర మైన రక్షణ అందించాలన్నారు. రిటైర్డ్‌ న్యాయాధికారి పప్పల జగన్నాఽథం మెడికో లీగల్‌, పోక్సో, సీసీపీఎన్‌డీటీ చట్టా లను వివరించారు. రిమ్స్‌ మానసిక వైద్య నిపుణులు రమ, దీపక్‌ బాధితులకు కౌన్సెలింగ్‌ చేసి మానసిక సహాయం అం దించా ల్సిన ప్రాముఖ్యత వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎం హెచ్‌వో డా.మేరీ కేథరిన్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ వో డా.తాడేల శ్రీకాంత్‌, డీసీవో రామదాసు, సోషల్‌ వర్కర్‌ వెంకటస్వామి, ప్రోగ్రాం అధికారులు శివరంజని, రవీంద్ర, సుజాత, ప్రవీణ్‌, మోహినీరత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 11:28 PM