దర్గాలో చందనోత్సవం
ABN , Publish Date - May 05 , 2025 | 12:01 AM
నగరంలో చౌకబజార్లో హజరత్ సయ్యద్ రోషన్ షావలి బాబా రహమతుల్లా షరీఫ్ సంఘ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
శ్రీకాకుళం కల్చరల్, మే 4(ఆంధ్రజ్యోతి): నగరంలో చౌకబజార్లో హజరత్ సయ్యద్ రోషన్ షావలి బాబా రహమతుల్లా షరీఫ్ సంఘ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాబా సమాదికి గందం పూసి, పూలదండలతో అలంకరించి ప్రత్యేకంగా ఖురాన్ పఠనం చేపట్టారు. దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరిం చారు. షేక్ సలీం సోదరులు చందనోత్సవం నిర్వహించారు. లంగర్ (విందు) కార్యక్రమాన్ని నిర్వహించారు. జామియా మసీదు ప్రతినిధులు షాన్, రఫీ, బాషా, అహమ్మద్, నజీరుద్దీన్, వహబ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు