Share News

ఎరువులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:58 PM

రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

ఎరువులను సద్వినియోగం చేసుకోవాలి
ఎరువుల వినియోగంపై కరపత్రాలు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌ తదితరులు

- ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతులకు కావల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. సోమవారం రామయ్యపుట్టుగలో ఎరువుల వాడకంపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలని, అధిక మోతాదులో వాడితే నష్టాలు వస్తాయని అన్నారు. అనంతరం ఎరువుల వినియోగంపై కరపత్రాలను విడుదల చేశారు. తహసీల్దార్‌ వెంకటరావు, ఎంపీడీవో రామారావు, ఏవో అజయ్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

39 టన్నులు సిద్ధం..

సోంపేట/రూరల్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో 39 టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నా యని తహసీల్దార్‌ బి.అప్పలస్వామి, వ్యవసాయశాఖ ఏడీ టి.భవానిశంకర్‌, ఏవో బి.నరసింహమూర్తి అన్నారు. మండలంలో సోమవారం వివిధ చోట్ల జరిగిన ఎరువుల పంపిణీని వారు పరిశీలించారు. రైతులంద రికీ సరిపడేలా ఎరువులు అందిస్తామని తెలిపారు.

ఎరువులు అందించండి

కంచిలి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండల రైతాంగానికి అవసరమైన ఎరువులను అందించాలనిటీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఆందోళన వద్దు: ఆర్డీవో

సరుబుజ్జిలి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అవసరం మేరకు యూరియా ఇతర ఎరువులు సరఫరా చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష అన్నారు. సోమవారం రాత్రి సరుబుజ్జిలిలో తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదన్‌ ఆధ్వర్యంలో రైతులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు దుకాణాల ద్వారా కాకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేయాలని రైతులు ఆర్డీవోను కోరారు. కార్యక్రమంలో ఏపీఎం కె.గోవిందరావు, డీటీ జగదీష్‌, టీడీపీ నాయకులు దవళ సింహాచలం, ఎండ రామారావు, కొమనాపల్లి రవికుమార్‌, ఇల్లాకుల ప్రభాకర్‌, ఎండ దొరబాబు, కూటికుప్పల కోటేశ్వరరావు పాల్గొన్నారు.

వెంటనే సరఫరా చేయాలి: సీపీఐ

అరసవల్లి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే సరఫరా చేయాలని సీపీఐ జిల్లా నాయకులు బి.సంతోష్‌, టి.తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తు న్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకు లు లబ్బరాజు, బమ్మిడి రాంబాబు, సత్యంనాయుడు, ఎల్‌.రమణ, తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల పంపిణీ

లావేరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఎరువులను రైతులు సక్రమంగా వినియోగింసుకోవాలని ఎంపీడీవో పి వెంకటరాజు, తహసీల్దార్‌ జీఎల్‌వీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం తాళ్లవలస రైతుసేవా కేంద్రంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్‌ ముప్పిడి మురళీ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:58 PM