private schools: ఫీజుల మోత
ABN , Publish Date - May 21 , 2025 | 12:27 AM
Private Schools Fee Hike విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్లు చేప డుతున్నాయి. పరిమిత సీట్లు అంటూ బోర్టులు పెట్టి.. ఆర్భాటపు ప్రకటనల తో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆక ర్షిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో సరైన సౌకర్యాలు, క్రీడా మైదానాలు లేకపోయినా నిర్వాహకులు ఫీజుల మోత మోగిస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో దోపిడీ
పుస్తకాలు, యూనిఫాం పేరిట అధిక వసూలు
ఒకటి నుంచి ఐదోతరగతి వరకు సొంత సిలబస్ అమలు
విద్యార్థుల తల్లిదండ్రులపై తప్పని భారం
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
నరసన్నపేటలోని ఒక ప్రైవేటు పాఠశాలను శనివారం మండల విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. ఆ సమయంలో విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి పుస్తకాలు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఒకటి నుంచి ఐదోతరగతి వరకు రాష్ట్ర సిలబస్ కాకుండా, ఇతర సిలబస్ పుస్తకాలను విక్రయిస్తున్నట్టు గుర్తించి.. పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించారు.
శ్రీకాకుళంలో ఒక కార్పొరేట్ పాఠశాలను ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. పిల్లలు అడేందుకు మైదానం కూడా లేదు. కానీ ఫీజులు మోతతో విద్యార్ధుల తల్లిదండ్రులు బోరు మంటున్నారు. ఒకటో తరగతికే ట్యూషన్ ఫీజు, పుస్తకాలు, ఇతర ఫీజులతో రూ.34వేలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నరసన్నపేట, మే 20(ఆంధ్రజ్యోతి): విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్లు చేప డుతున్నాయి. పరిమిత సీట్లు అంటూ బోర్టులు పెట్టి.. ఆర్భాటపు ప్రకటనల తో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆక ర్షిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో సరైన సౌకర్యాలు, క్రీడా మైదానాలు లేకపోయినా నిర్వాహకులు ఫీజుల మోత మోగిస్తున్నారు. అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.2వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, స్కూల్ డెవలప్‌మెంట్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, స్మార్ట్ క్లాసులు.. ఇలా అన్నింటికీ ఫీజులు పిండే స్తున్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకుంటే రెగ్యులర్ ఫీజుతోపాటు అదనపు భారాన్ని మోయాల్సిందే. పుస్తకాలు, యూనిఫాం, షూ కూడా తమ పాఠ శాలలోనే కొనుగోలు చేసేలా నిబంధ న విధిస్తున్నారు. వాటి పేరిట మరి కొంత దోచేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు పాఠ్యపుస్తకాలను రూ.10వేల నుంచి రూ.12వేలకు విక్రయిస్తున్నారు.
ప్రభుత్వం నిర్ధారించే ఫీజులు ఇలా
ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటోతరగతి నుండి మూడో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.6వేలు, మండల కేంద్రాల్లో ఉన్న పాఠశాలల్లో రూ.7,500, పట్టణాల్లో 8,600, జిల్లా కేంద్రంలో రూ.10వేలు చొప్పున ఫీజులు నిర్థారించారు. 4-5 తరగతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.9వేలు, పట్టణాల్లో రూ.10,500, జిల్లా కేంద్రంలో రూ.12వేలు, ఆరోతరగతికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.9వేలు, మండల కేంద్రాల్లో 9,500, పట్టణాల్లో రూ.11,100 పాఠశాల స్టార్ రేటింగ్ మేరకు ఈ ఫీజులను నిర్ణయించారు.
అమలు కాని నిబంధనలు
కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై అధ్యయనం చేయడానికి ఐఏఎస్ అధికారులతో గతంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఏ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రామాలు,పట్టణాల్లో పాఠశాలలను ఐదు కేటగిరీలుగా విభజించారు. మొత్తం 474 స్కూళ్లకు ర్యాంకింగ్‌లు ఇచ్చారు. స్టార్ రేటింగ్ స్కూల్స్‌కు 1 నుంచి 10వ తరగతి వరకు ఫీజులు కూడా నిర్ధారిస్తూ ఈ కమిటీ సిఫారసు చేసింది. అలాగే ఫీజు వసూలు, సౌకర్యాల వంటి వివరాలను నోటీసుబోర్డులో ప్రదర్శించాలి. కానీ ఈ నిబంధనలను ప్రైవేటు పాఠశాలలు పాటించడం లేదు. సిలబస్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించే పుస్తకాలను బోధించాలి. కానీ కొన్ని పాఠశాలల్లో ఒక్కొక్క పబ్లికేషన్ పుస్తకాలను ఐటీఐ ఒరియంటెడ్ పేరుతో విక్రయిస్తూ.. వాటినే బోధిస్తున్నారు. ఆరోతరగతి నుంచి తొమ్మిదోత రగతి వరకు ఇంటర్‌స్థాయిలో ఉండే సిలబస్‌ను జోడించి సొంతంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.