రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:19 AM
రైతుల సంక్షేమమే ప్ర భుత్వ ధ్యేయమ ని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు అన్నారు.
ఎల్‌ఎన్ పేట, ఆగస్టు 5(ఆంధ్ర జ్యోతి): రైతుల సంక్షేమమే ప్ర భుత్వ ధ్యేయమ ని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు అన్నారు. మండల కేం ద్రంలో మంగళ వారం పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణోత్సవంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నా రు. ఖరీఫ్‌లో రైతులకు అండగా నిలచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న దాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారన్నారు. గత ప్రభు త్వ పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోయాన్నారు. ఈ సందర్భంగా పీ ఏసీఎస్ అధ్యక్షుడిగా కె.మన్మఽథరావు, డైరెక్టర్లుగా వై.రాంబాబు, కె.శ్రీనుతో ప్రమా ణం చేయించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మ నోహర్‌నాయుడు, కె.చిరంజీవి, నాయకులు వి.ఆనందరావు, ఎస్.కిషోర్‌కుమార్, సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్.తేజేశ్వరరావు, వి.గోవిందరావు, కె.తిరుపతిరావు, ఎస్. మోహనరావు, టి.అప్పన్న, కె.కృష్ణమాచారి, జి.రాము తదితరులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు పీ-4 కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా, తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ, ఇన్‌చార్జి ఎంపీడీవో పి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.