రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:59 PM
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గురువారం నిజామాబాద్ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఖరీఫ్ రైతులకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
గార, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గురువారం నిజామాబాద్ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఖరీఫ్ రైతులకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని అన్నారు. గార మండలంలో శివారు భూములకు కూడా ఈ ఖరీఫ్‌లో పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుం టున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయిం ట్ డైరెక్టర్ కె.త్రినాథస్వామి, ఏవో దుంపల పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం
శ్రీకాకుళం రూరల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): సింగుపురం పంచాయ తీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం రోటరీ క్లబ్ శ్రీకాకుళం బృందం సభ్యులు విద్యార్థులకు సుమారు రూ.ఆరు లక్షల విలువైన పరుపులను అందించారు. ఈ కార్యక్ర మంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు లలిత, సమగ్ర శిక్ష పీవో శశిభూషణ్, రోటరీ క్లబ్ శ్రీకాకుళం అధ్యక్షుడు ముని శ్రీనివాస్, సెక్రటరీ దూసి సంతోష్, కోశాధికారి సూర్య పసగాడ, సర్పంచ్ గుండ ఆదిత్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.