Share News

రైతుల సంక్షేమమే లక్ష్యం: అశోక్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:49 PM

రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

రైతుల సంక్షేమమే లక్ష్యం: అశోక్‌
నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

సోంపేట రూరల్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే పైడిగాం చానల్‌ నుంచి బాతుపురం వద్ద ఆదివారం పూజ చేసి నీటిని విడు దల చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరందించే దిశలో కృషి చేస్తు న్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర మోహన్‌, నేతలు మడ్డు కుమార్‌, మద్దిల నాగేశ్వరరావు, బేసి కొర్లాం నీటి నంఘాల అధ్యక్షులు, రైతు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:49 PM