రైతులకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:13 AM
ప్రభుత్వం ఇచ్చిన పదవిని బాధ్య తగా భావించి రైతులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకాంక్షించారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస రూరల్, జూలై 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇచ్చిన పదవిని బాధ్య తగా భావించి రైతులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకాంక్షించారు. బుధవారం నిర్వహించిన పలాస పీఏసీఎస్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆమె పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రైతులు అన్ని విధాలుగా దగాపడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త తొలుత వంశధార కాలువల మరమ్మతులు చేయించి శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చేశామన్నారు. అనంతరం పీఏసీఎస్ చైర్మన్‌గా వంకల కూర్మారావుచే ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు వజ్జ బాబూరావు, పీరికట్ల విఠల్‌రావు, కుత్తుమ లక్ష్మణరావు, లొడగల కామేశ్వరరావు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ హేమబాబు చౌదరి, గాలి కృష్ణారా వు, పీఏసీఎస్ సభ్యులు ఆర్.సుదర్శనరావు, బి.దుష్యంత్ పాల్గొన్నారు.