సాగుదారులకు పట్టాలివ్వాలి
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:59 PM
మండలంలోని కొయ్యాం రెవెన్యూ పరిధిలోని బడివానిపేట పంచాయతీలోని జాలారికొయ్యాంలో సర్వేనెంబర్లు 341, 442లోని 40 ఎకరాలకు సంబంఽధించి సాగులో ఉన్న మత్స్యకారులకు సాగు పట్టాలివ్వా లని మత్స్యకారఐక్యవేదిక ప్రతినిధులు కోనాడ నర్సింగరావు, దుమ్ముఅశోక్, మైల పల్లి కామరాజు, చింతపల్లిసూర్యనారాయణ డిమాండ్‌చేశారు.
ఎచ్చెర్ల,జూన్28(ఆంధ్రజ్యోతి):మండలంలోని కొయ్యాం రెవెన్యూ పరిధిలోని బడివానిపేట పంచాయతీలోని జాలారికొయ్యాంలో సర్వేనెంబర్లు 341, 442లోని 40 ఎకరాలకు సంబంఽధించి సాగులో ఉన్న మత్స్యకారులకు సాగు పట్టాలివ్వా లని మత్స్యకారఐక్యవేదిక ప్రతినిధులు కోనాడ నర్సింగరావు, దుమ్ముఅశోక్, మైల పల్లి కామరాజు, చింతపల్లిసూర్యనారాయణ డిమాండ్‌చేశారు.శనివారం జాలారి కొయ్యాంలోని మత్స్యకారుల సాగులో ఉన్న ప్రభుత్వ గయాల్ భూమిలో ఐక్య వేదిక ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడి భూముల్లో రైతులు జీడిమామిడి, సరుగుడు, నీలగిరి వంటి తోటలను సాగు చేస్తున్నారని తెలిపారు. ఈభూములను ఆక్రమించేందుకు కొంతమంది ప్రయ త్నిస్తున్నారని, ఏళ్లతరబడిలో మత్స్యకారుల సాగులో ఉన్న వీటికి పట్టాలు మం జూరుచేయాలని డిమాండ్‌చేశారు. మత్స్యకార రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మత్స్యకార సంఘ నేతలు మూగి కొర్లయ్య, మారుపల్లి నారాయణరాజు, అంబటి రాంబాబు, కారి తాతారావు, వారది ఎర్ర య్య, మధు, లక్ష్మణరావు పాల్గొన్నారు.