Share News

యూరియా కోసం రైతుల నిరసన

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:49 PM

కోటబొమ్మాళి యూరియాకోసం రైతులు నిరసన తెలిపారు. ఎరువుల షాపుల వద్ద యూరియా అందజేస్తామని సోమవారం వ్యవసాయాధికారులు టోకెన్లు ఇచ్చారు. దీంతో రైతులు బుధవారం టోకెన్లతో కోటబొమ్మాళిలోని ఎరువుల షాపుల వద్దకు చేరుకున్నారు.

 యూరియా కోసం రైతుల నిరసన
వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రైతులు:

కోటబొమ్మాళి, సెప్టెంబరు 17 (ఆంఽధ్రజ్యోతి): కోటబొమ్మాళి యూరియాకోసం రైతులు నిరసన తెలిపారు. ఎరువుల షాపుల వద్ద యూరియా అందజేస్తామని సోమవారం వ్యవసాయాధికారులు టోకెన్లు ఇచ్చారు. దీంతో రైతులు బుధవారం టోకెన్లతో కోటబొమ్మాళిలోని ఎరువుల షాపుల వద్దకు చేరుకున్నారు. యూరియా లేదని షాపుల నిర్వాహకులు తెలియజేయడంతో రైతులు వ్యవసాయకార్యాలయం వద్దకు చేరుకున్నారు.కార్యాలయంలో మూసివేయడంతో రోడ్డుపై భైఠాయించారు. దీంతో అక్కడకు పోలీసులు చేరుకుని ఏవో గోవిందరావుతో ఫోన్‌లో మాట్లాడారు. కోటబొమ్మాళిలో షాపులకు యూరియా వచ్చిందని, సరఫరా చేయడానికి కోడ్‌రాక పోవడంతో గురువారం టోకెన్‌ఉన్న ప్రతి రైతుకు అందజేస్తామని ఏవో తెలిపారు. ఈవిషయం రైతులకు పోలీసులు తెలియజేసి అక్కడ నుంచి పంపించివేశారు.

ఫ పాతపట్నం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని శార్వాయ ఎంట ర్‌ప్రైజెస్‌, రమేష్‌ అండ్‌ సురేష్‌ట్రేడర్స్‌ షాపుల్లో పోలీస్‌ పహర మధ్య యూరియాను బుధవారం పంపిణీచేశారు.అధికారులు గ్రామాల్లో ఇచ్చిన టోకెన్లప్రాప్తికి దుకాణాల్లో యూరియా పంపిణీ చేపట్టగా రైతులు బారులుతీరారు.రెండుషాపుల్లో 1100ల యూరియా బస్తాలను పంపిణీ చేపడుతున్నట్లు ఏవో కిరణవాణి తెలిపారు.

Updated Date - Sep 17 , 2025 | 11:49 PM