Share News

ఆర్వో ప్లాంట్‌ పనులను అడ్డుకున్న రైతులు

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:37 PM

రణస్థలం పంచా యతీ నగర ప్పాలెం సమీ పంలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటుకు సంబం ధిత యాజమాన్యం శుక్రవారం సిద్ధం కాగా విషయం తెలుసుకున్న నగరప్పాలెం, బండిపాలెం గ్రామాల రైతులు, యువకులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు.

ఆర్వో ప్లాంట్‌ పనులను అడ్డుకున్న రైతులు
రైతులతో మాట్లాడుతున్న పోలీసులు

రణస్థలం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రణస్థలం పంచా యతీ నగర ప్పాలెం సమీ పంలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటుకు సంబం ధిత యాజమాన్యం శుక్రవారం సిద్ధం కాగా విషయం తెలుసుకున్న నగరప్పాలెం, బండిపాలెం గ్రామాల రైతులు, యువకులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకు న్నారు. ఈ ప్రాంతంలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే మా వ్యవసాయ బోర్లు పనిచేయవని, పంటలకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలు వురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వందల అడుగుల లోతులో బోర్లు తీసి నీరు వినియోగిస్తే రైతుల పరిస్థితి ఏమి టని నిర్వాహకులను ప్రశ్నిం చారు. ఈ నేపథ్యంలో ఆర్వో ప్లాంట్‌ యాజ మాన్యానికి రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జేఆర్‌పురం పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని వివ రాలు తెలుసుకున్నారు. రైతులు, సంబంధిత యాజమాన్య ప్రతినిధులను పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఆర్వో ప్లాంట్‌ ఏర్పా టుపై ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికా రులకు నివేదిస్తామని ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి రైతులకు సూచించారు. దీంతో రైతులు తహసీల్దార్‌ను కలిసి సమస్యను వివరించారు.

Updated Date - Nov 14 , 2025 | 11:37 PM