Share News

పాతపట్నానికి రైతుబజారు మంజూరు: ఎంజీఆర్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:00 AM

పాతపట్నంలో రైతుబజారు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఎమ్మెల్యే మామిడి గోవిం దరావు తెలిపారు. మంగళవారం పాతపట్నంలోని ఆలాంధ్రరోడ్‌లోగల ప్రహరాజ పాలెం రెవెన్యూ గ్రామపరిధిలో రైతుబజారు ఏర్పాటుకోసం స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.

పాతపట్నానికి రైతుబజారు మంజూరు: ఎంజీఆర్‌
స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం/రూరల్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలో రైతుబజారు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఎమ్మెల్యే మామిడి గోవిం దరావు తెలిపారు. మంగళవారం పాతపట్నంలోని ఆలాంధ్రరోడ్‌లోగల ప్రహరాజ పాలెం రెవెన్యూ గ్రామపరిధిలో రైతుబజారు ఏర్పాటుకోసం స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.కార్యక్రమంలో తహసాల్దార్‌ ప్రసాదరావు, టీడీపీ నేతలు పైల బాబ్జీ, సైలాడ సతీష్‌ అక్కంద్ర సన్యాసిరావు, ప్రభాకరరావు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక భావాలే ప్రశాంతతకు మార్గం

పాతపట్నం అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికభావాలే ప్రశాంతతకు మార్గమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నం పరిధిలోని అచ్యుతాపురం ముత్యాలమ్మతల్లి ఆలయం ఆవరణలో అయ్యప్పస్వామి సన్నిధాన నిర్మాణానికి భక్తుడు బీవీప్రసాద్‌ ఇచ్చిన రూ.20వేలు విరాళాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అయ్యప్ప భక్తులకు మంగళవారం అందజేశారు.

Updated Date - Oct 22 , 2025 | 12:00 AM