నాగావళి నదిలో రైతు గల్లంతు
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:47 PM
Farmer drowns ఆమదాల వలస మండలం కనుగుల వలస గ్రామానికి చెందిన కొక్కిరాల నారాయుడు అనే రైతు నాగావళి నదిలో దిగి గల్లంతయ్యారు.
ఆమదాలవలస, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఆమదాల వలస మండలం కనుగుల వలస గ్రామానికి చెందిన కొక్కిరాల నారాయుడు అనే రైతు నాగావళి నదిలో దిగి గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, సర్పంచ్ నూక రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ‘దూసి గ్రామంలో ఉన్న పొలంలో యూరియా జల్లేందుకు నారాయుడు శుక్రవారం వెళ్లాడు. సాయంత్రం తిరిగొస్తూ నాగావళి నదిలో కాళ్లు, చేతులు కడుక్కోవడానికి దిగి జారిపోయాడు. ఆ సమయంలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో నదిలో కొట్టుకుపోయాడు. కాపాడండి అంటూ కేకలు వేయగా.. సమీప పొలంలో ఉన్నవారు అక్కడకు వెళ్లినా ఆచూకీ కనిపించ లేదు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు విలపించారు. దీనిపై పోలీసులకు, అధికారు లకు ఫిర్యాదు. ఈ మేరకు శనివారం ఉదయం నాగావళి నదిలో నారాయుడు ఆచూకీ కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో భార్య సుభద్ర, కుమారుడు నాగరాజు, ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటన పై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆమదాలవలస ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.