Share News

పోలీసుల పహారాలో ఫరీద్‌పేట

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:04 AM

ఫరీద్‌పేట గ్రామం పోలీసుల పహారాలో ఉంది. శుక్రవారం ఈ గ్రామానికి చెందిన సత్తారు గోపి హత్యకు గురైన నేపథ్యం తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మొహ రించారు.

పోలీసుల పహారాలో ఫరీద్‌పేట
ఫరీద్‌పేటలో మోహరించిన పోలీసులు

  • బందోబస్తు నడుమ హత్యకు గురైన గోపి అంత్యక్రియలు

ఎచ్చెర్ల, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఫరీద్‌పేట గ్రామం పోలీసుల పహారాలో ఉంది. శుక్రవారం ఈ గ్రామానికి చెందిన సత్తారు గోపి హత్యకు గురైన నేపథ్యం తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మొహ రించారు. ఫరీద్‌పేట ముఖ్య కూడలితో పాటు, నవ భారత్‌ ఫ్లైఓవర్‌, కొయ్యరాళ్ల కూడలి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో గోపి మృతదేహానికి శనివారం పోస్టుమార్టం అనంతరం గ్రామంలోని శ్మశాన వాటికలో పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి పర్యవేక్షణలో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో సాధారణ పరిస్థితు లు వచ్చేంతవరకు బందోబస్తు కొనసాగుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. గోపితోపాటు బైక్‌ వెనుకన కూర్చున్న సత్తారు కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు 12మందిపై కేసు నమోదు చేసి జేఆర్‌ పురం సీఐ ఎం.అవతారం దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ తెలిపారు. కాగా విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ తదితర వైసీపీ నేతలు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Updated Date - Jul 13 , 2025 | 12:04 AM