అసత్య ప్రచారాలు మానుకోవాలి
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:13 AM
శ్రీకాకుళం రోడ్‌లో ఉన్న రైల్వే గూడ్స్‌షెడ్ హరిశ్చంద్రపురానికి తరలివెళ్లిపోతుందని చేస్తున్న అసత్య ప్రచారాలను వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవి కుమార్ మానుకోవాలని టీడీపీ జిల్లా కార్యదర్శి మొదలవలస ర మేష్ అన్నారు.

ఆమదాలవలస, జూలై 5(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్‌లో ఉన్న రైల్వే గూడ్స్‌షెడ్ హరిశ్చంద్రపురానికి తరలివెళ్లిపోతుందని చేస్తున్న అసత్య ప్రచారాలను వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతాడ రవి కుమార్ మానుకోవాలని టీడీపీ జిల్లా కార్యదర్శి మొదలవలస ర మేష్ అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గూడ్స్ షెడ్ తరలిపోతుం దని అసత్య ప్రచారం చేస్తూ కూలీలు ప్రజల్లో అయోమయం సృష్టించడం తగదన్నారు. ఆయన ఏ సమాచారంతో ఇటువంటి తప్పుడు ప్రకటన చేశారో తెలపాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే ఈ ఐదేళ్లలో గూడ్స్‌షెడ్ ఎక్కడికి తరలివెళ్లదని ఒక వేళ తరలివెళితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. లేకుంటే చింతాడ రవికుమార్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధిలో ఎంపీ రామ్మోహన్, నియోజకవర్గ అభివృద్ధిలో కూన రవికుమార్ తనదైన ముద్ర వేస్తూ పరుగులు పెట్టిస్తుండడం చింతాడ రవికుమార్ సహించ లేక ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటు న్నాడన్నారు. ఏదైనా అంశంపై మాట్లాడేటప్పుడు పూర్తి సమా చారం స్పృహతో మాట్లాడాలన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణ లు మానుకోవాలని సూచించారు. మాల కార్పొరేషన్ డైరెక్టర్ బోనె ల అప్పారావు, మాజీ కౌన్సిలర్ ఇంజరాపు విశ్వనాథం, నియోజక వర్గ యాదవ సంఘ అధ్యక్షుడు నాగళ్ల మురళీధర్, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు బీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.