Share News

తహసీల్దార్‌పై తప్పుడు ఆరోపణలు తగదు

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:59 PM

విధి నిర్వహణలో ఉన్న కొత్తూరు తహసీల్దార్‌ కొప్పల బాలకృష్ణపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకొని అరెస్టుచేయాలని దళిత ఉద్యోగ, ప్రజాసంఘాలు కోరాయి.

తహసీల్దార్‌పై తప్పుడు ఆరోపణలు తగదు
పాతపట్నం: నిరసన తెలుపుతున్న తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది :

కొత్తూరు, అక్టోబరు 13(ఆంరఽధజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న కొత్తూరు తహసీల్దార్‌ కొప్పల బాలకృష్ణపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకొని అరెస్టుచేయాలని దళిత ఉద్యోగ, ప్రజాసంఘాలు కోరాయి. ఈమేరకు సోమ వారం కొత్తూరులో ఆయాసంఘాల నాయకులు తిరుపతిరావు, శిర్ల ప్రసాదరావు, రామక్రష్ణలు, జమ్మయ్య ఆధ్వర్యంలో ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ బలదకు చెందిన మహిళ తప్పుడు ఆరోపణలు చేసి భౌతికదాడికి పాల్పడ డంతో అరెస్టులు చేయాలనికోరారు. ఈ విషయంపై సమగ్రంగా విచారణ జరిపించి సదరు మహిళతోపాటు మరో ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కొత్తూరు పోలీసులకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఫపాతపట్నం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): విఽధి నిర్వహణలో ఉన్న కొత్తూరు తహసీల్దార్‌పై ఇటీవల జరిగిన దాడికి పాతపట్నం తహశీల్దార్‌ కార్యాలయ సిబ్బంది సోమవారం నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, గ్రామరెవెన్యూ అధికారులు, గ్రామసర్వేయర్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:59 PM