భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలి
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:44 PM
నీలమ ణి దుర్గ ఆలయ అభి వృద్ధికి కృషిచేయడంతో పాటు భక్తులకు సౌక ర్యాలు మెరుగుపరచాలని శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు, పాత పట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): నీలమ ణి దుర్గ ఆలయ అభి వృద్ధికి కృషిచేయడంతో పాటు భక్తులకు సౌక ర్యాలు మెరుగుపరచాలని శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు, పాత పట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం స్థానిక క్యాంపుకార్యాలయంలో నీలమణి దుర్గ ఆలయ అధ్యక్షుడు అక్కంద్ర సన్యాసిరావుతోపాటు పాలకమండలి సభ్యులు ఎంజీఆర్‌ను కలిశారు. అలాగేఅసెంబ్లీ సమావేశాల్లో పాతపట్నం, కొత్తూరు కోర్టుభవనాల కోసం ప్రస్తావించడంతో ఆయాకోర్టుల బార్‌అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను అభినం దించారు. కాగా పాతపట్నం కళింగవైశ్యసంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన కలివరపు మధును ఎమ్మెల్యేగోవిందరావు అభినందించారు. సంఘ గౌరవాధ్యక్షుడు శాసనపురి మహేశ్వరరావు, యెరుకోల కృష్ణారావు,మధుబాబు, దేవరశెట్టి వెంకటరమణ, రాజు, కోరాడ మురళి తదితర కళింగవైశ్య సంఘనాయకులు ఎమ్మెల్యేను కలిశారు.
ఫఎల్.ఎన్.పేట, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి):పాతపట్నంలోని క్యాంపు కార్యాల యంలో బీటీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు.