పేలిన ప్రెజర్ కుక్కర్
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:04 AM
నువ్వలరేవు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో ప్రెజర్ కుక్కరు పేలడంతో అక్కడే ఉన్న ముగ్గురు వంట నిర్వాహకులు గాయపడ్డారు.
ముగ్గురు ‘భోజనం’ నిర్వాహకులకు గాయాలు
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
నువ్వలరేవు పాఠశాలలో ఘటన
వజ్రపుకొత్తూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): నువ్వలరేవు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో ప్రెజర్ కుక్కరు పేలడంతో అక్కడే ఉన్న ముగ్గురు వంట నిర్వాహకులు గాయపడ్డారు. క్షతగాత్రులను పలాస ప్రభుత్వాసుపత్రికి తలరించి చికిత్స అందిస్తూన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... నువ్వలరేవు తెలుగు మీడియం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వంట నిర్వాహకులుగా బైనపల్లి అమ్మి (హేమ), మువ్వల దశమంతి, బైనపల్లి మోహిని పనిచేస్తున్నారు. గురువారం ఎప్పటిలాగే గ్యాస్ స్టౌవ్ మీద ఒకవైపు అన్నం వండుతూ మరోవైపు కంది పప్పును ప్రెజర్ కుక్కరులో పెట్టారు. ఈ క్రమంలో కంది పప్పు ఉడికిస్తున్న సమయంలో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. అక్కడే ఉన్న అమ్మి, దశమంతి, మోహిని ముఖంపైనా, చేతులు పైనా పడిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే వారిని వజ్రపుకొత్తూరు పీహెచ్‌సీ తరలించగా వైద్యులు బూన్, తేజస్విత ప్రథమ చికిత్స అందించారు. తహసీల్దార్ సీతారామయ్య, ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు అక్కడికి చేరుకుని పరామర్శించి, జరిగిన ఘటనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పలాస సీహెచ్‌సీకి తరలించారు. వీరి ఆరోగ్యం నిలకడ ఉందని, వీరి దశమంతి గాయాలు తీవ్రంగా ఉన్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి, ప్రమాదంపై ఆరా తీశారు. వీరి పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఏపీటీఎఫ్‌సీ చైర్మన్ వజ్జ బాబురావు కూటమి నాయకులు బడ ్డనాగరాజు, నువ్వలరేవు మాజీ ఎంపీటీసీ వెంకటేష్ ఉన్నారు.