సూపర్ జీఎస్టీపై ప్రజలకు వివరించండి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:44 PM
: సూపర్ జీఎస్టీ సేవింగ్స్‌పై ప్రజలకు వివరించాలని ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం జీఎస్టీ సూపర్ సేవింగ్స్, పీఎం కుసుమ్,సీబీజీ ప్లాంట్లు, సౌర పవన ప్రాజెక్టులు, గంజాయి, డ్రగ్స్, అన్నాక్యాంటీన్లు, చెత్త సేకరణ, భూసమస్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సుమారు రూ.ఐదు వేలకోట్ల నష్టం వచ్చినా ప్రభుత్వం ప్రజల కోసం భరిస్తోందన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యో తి): సూపర్ జీఎస్టీ సేవింగ్స్‌పై ప్రజలకు వివరించాలని ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం జీఎస్టీ సూపర్ సేవింగ్స్, పీఎం కుసుమ్,సీబీజీ ప్లాంట్లు, సౌర పవన ప్రాజెక్టులు, గంజాయి, డ్రగ్స్, అన్నాక్యాంటీన్లు, చెత్త సేకరణ, భూసమస్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సుమారు రూ.ఐదు వేలకోట్ల నష్టం వచ్చినా ప్రభుత్వం ప్రజల కోసం భరిస్తోందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జీఎస్టీ, జిల్లా అధికారులతో ఎప్పటికే సమా వేశం ఏర్పాటు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.