బయోవేస్టేజీకి కాలంచెల్లిన మందులు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:57 PM
మెడికల్ షాపుల నుంచి కాలంచెల్లిన (ఎక్స్‌పైర్ అయిన) మందు లను ఇకపై బయోవేస్టేజీకి అప్పగించనున్నారు. ఈమేరకు శనివారం నుంచి జిల్లా ఔషధ నియంత్రణ మండలి అధికా రులు రాష్ట్రంలో తొలిసారిగా శ్రీకాకుళంలో అమలుచేస్తు న్నారు. ఇదివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఆసుపత్రి వ్యర్థాలను కాలుష్య నియంత్రణ మండలి ఆమో దించిన సంస్థలకు బయో వేస్టేజీని వేరుచేసి అప్పగించే వారు.
శ్రీకాకుళం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): మెడికల్ షాపుల నుంచి కాలంచెల్లిన (ఎక్స్‌పైర్ అయిన) మందు లను ఇకపై బయోవేస్టేజీకి అప్పగించనున్నారు. ఈమేరకు శనివారం నుంచి జిల్లా ఔషధ నియంత్రణ మండలి అధికా రులు రాష్ట్రంలో తొలిసారిగా శ్రీకాకుళంలో అమలుచేస్తు న్నారు. ఇదివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఆసుపత్రి వ్యర్థాలను కాలుష్య నియంత్రణ మండలి ఆమో దించిన సంస్థలకు బయో వేస్టేజీని వేరుచేసి అప్పగించే వారు. కానీ ప్రైవేటు మందుల దుకాణాల్లో పాడైన మందులు, ఎక్స్‌పైర్ అయిన మందులను విసిరివేయడం లేదా, భూమిలో కప్పిపెట్టడం, డ్రైనేజీలో పారబోయడం, చెత్తలో పారబోయడం చేసేవారు. ఇకపై అలాకాకుండా ఆ మందుల వల్ల ప్రమాదాలు సంభవించకుండా వృథామందులను ప్రైవేటు ఆసుపత్రి వ్యర్థాల మాదిరిగానే గుర్తించి బయోవేస్టేజీకి అప్పగించేలా ఫార్మాసిస్టులకు జిల్లా ఔషధ నియంత్రణ సహాయ సంచాలకుడు చంద్రరావు ఆదేశించారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో అన్ని మందుల దుకాణాల ఫార్మాసిస్టులతో సమావేశం నిర్వహించారు. హోల్‌సేల్ ఫార్మా, జనరిక్, పీసీడీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిగిలిపోయిన మందులను సైతం బయోవేస్టేజీకి అప్పగించాలని ఆదేశించడంతో పాటు అమలుచేయించారు. జిల్లా కాలుష్యనియంత్రణ మండలి ఆమోదించిన రైన్‌బౌ సంస్థకు మెడికల్ షాపుల నుంచి కాలంచెల్లిన మందులను అప్పగించారు. ఇకపై ప్రతి దుకాణదారుడు ఇలానే అప్పగించాలని, ఎక్కడా పారబోయకూడదని, ఈ విధానం రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకాకుళంలో అమలవుతుందని తెలిపారు.