house construction ఇళ్ల నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:09 AM
house construction ఆన్‌లైన్‌లో ఇళ్ల నిర్మా ణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే అనుమతులిచ్చేం దుకు చర్యలు తీసుకోవాలని విశాఖ రీజియన్ పట్టణ ప్రణాళిక ప్రాంతీయ డైరెక్టర్ పి.నాయుడు ఆదేశించారు.

పట్టణ ప్రణాళిక ప్రాంతీయ డైరెక్టర్ పి.నాయుడు
పలాస, ఏప్రిల్ 9 (ఆంధ్ర జ్యోతి): ఆన్‌లైన్‌లో ఇళ్ల నిర్మా ణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే అనుమతులిచ్చేం దుకు చర్యలు తీసుకోవాలని విశాఖ రీజియన్ పట్టణ ప్రణాళిక ప్రాంతీయ డైరెక్టర్ పి.నాయుడు ఆదేశించారు. బుధవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, సచివాలయ ప్లానింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్ర మ నిర్మాణాలకు తావివ్వ వద్దన్నారు. ప్లాన్‌లకు వచ్చిన దర ఖాస్తులను పరిశీలించి వాటిలో లోటుపాట్లను దరఖా స్తుదారులకు వివరించి ఆ తరువాత ప్లాన్‌లను మంజూరు చేస్తే ఎటువంటి అక్ర మాలకు తావు ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ అనుమతులు సులభతరం చేసిం దని, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేస్తే నిబంధనల మేరకు అనుమతులిస్తున్నా మన్నారు. సమావేశంలో కమిషనర్ ఎన్. రామారావు, ఏడీటీపీ శ్రావణి, డీటీసీపీ కృష్ణ, టీపీవో వరప్రసాద్, టీపీఏ సంతోష్, సర్వేయర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.