ఎరువుల పంపిణీ నుంచి మినహాయించండి
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:00 AM
ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించాలని జిల్లాలోని గ్రామ వ్యవసాయ సహాయ కులు (వీఏఏ), గ్రామ ఉద్యానవన సహాయకులు(వీహెచ్‌ఏ)లు గురువారం సాయంత్రం కలెక్టరేట్ వద్ద నిరసనకుదిగారు.సమస్యలపై కలెక్టర్ వచ్చి మాట్లాడి పరిష్కరించాలని బైఠాయించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించాలని జిల్లాలోని గ్రామ వ్యవసాయ సహాయ కులు (వీఏఏ), గ్రామ ఉద్యానవన సహాయకులు(వీహెచ్‌ఏ)లు గురువారం సాయంత్రం కలెక్టరేట్ వద్ద నిరసనకుదిగారు.సమస్యలపై కలెక్టర్ వచ్చి మాట్లాడి పరిష్కరించాలని బైఠాయించారు.అక్కడికు వచ్చిన కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్‌కు వీఏఏ, వీహెచ్‌ఏలు తమ సమస్యలను వివరించా రు. ఎరువులపంపిణీలో రాజకీయఒత్తిళ్లు, రైతుల నుంచిఅవమానాలు ఎదు ర్కొంటున్నామని వివరించారు.ఇంతవరకు ఇచ్చిన ఎరువులను స్టాకు ఉన్నం తవరకు పంపిణీ చేస్తామని, ఇక ముందు వచ్చే ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించాలని కోరారు. రైతులు ఎరువులకు వచ్చిన వారే మళ్లీమళ్లీ వచ్చి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.తమలో67 శాతం మహి ళలు పనిచేస్తున్నారని, వారిపై కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక ఎంతమాత్రం ఎరువుల పంపిణీ చేయలేమని కలెక్టర్‌కు తెల్చిచెప్పారు. పీఏసీఎస్‌లకు అప్పగించాలని కోరడంతో కలెక్టర్ భరోసా ఇచ్చారు. శుక్రవారం పీఏసీఎస్, సొసైటీలు, డీలర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని, మీ తరపున కూడా ఐదుగురు ప్రతినిధులు వస్తే సమస్యలకు తక్షణ పరిష్కారం ఆలోచించి, ఆందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. గంటన్నర పాటు చర్చించిన తర్వాత వీఏఏలు, వీహెచ్‌ఏలు శాంతించారు. రాత్రి పది గంటల వరకు ఈ చర్చలు జరిగాయి.