sports celebrations : ఉత్సాహంగా గ్రామీణ క్రీడల పోటీలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:15 AM
vajrotham celebrations వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాస్థాయి గ్రామీణ క్రీడల పోటీలు స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో గురువారం ఉత్సాహంగా జరిగాయి.
విజేతలకు డీఎస్‌డీవో బహుమతుల ప్రదానం
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాస్థాయి గ్రామీణ క్రీడల పోటీలు స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో గురువారం ఉత్సాహంగా జరిగాయి. కర్రసాము, సంగిడీల తీత, పిల్లిమొగ్గలు, గూటాల తిప్పుట, ఉలవల బస్తా ఎత్తుట వంటి పోటీలలో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకరరావు, డీఎస్‌డీవో కె.శ్రీధర్, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి డి.మధుసూదనరావు, సమాచార పౌరసంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది, క్రీడా శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు
కర్రసాము పోటీలు పురుషుల విభాగంలో..
బి.ఖగేశ్వరరావు(ప్రథమ), ఏ.పాపారావు(ద్వితీయ), సీహెచ్.శంకర్రావు(తృతీయ), సీనియర్ బాలుర విభాగంలో బి.ఖగేశ్వరరావు(ప్రథమ), ఏ.పాపారావు(ద్వితీయ), కె.పారయ్య (తృతీయ), జూనియర్ బాలుర విభాగంలో ఎస్.సుమంత్(ప్రథమ), ఏ.రాజకృష్ణ(ద్వితీయ), ఐ.యశోధర్(తృతీయ), సబ్ జూనియర్ బాలుర విభాగంలో ఆర్.నరేంద్రనాయుడు(ప్రథమ), బి.మణి సతీష్(ద్వితీయ), ఏ.ముకుందరెడ్డి(తృతీయ), సీనియర్ బాలికల విభాగంలో బి.శ్రీలేఖ(ప్రథమ), వి.సాహితి సౌమ్య(ద్వితీయ), బి.భావన సాయి(తృతీయ) బహుమతులు గెలుచుకున్నారు.
పిల్లి మొగ్గలు బారుల విభాగం పోటీల్లో నరేంద్రనాయుడు ప్రథమ బహుమతి విజేతగా నిలిచాడు.
ఇసురు గుండు పురుషుల విభాగంలో టి.రామకృష్ణ(ప్రథమ), పి.క్రిష్ణారావు(ద్వితీయ), ఏ.త్రినాథరావు (తృతీయ)
తీత సంగిడి పోటీల్లో పి.క్రిష్ణ(ప్రథమ), జి.రమణ(ద్వితీయ), కె.సత్య(తృతీయ)
ఈడుపు సంగిడి పోటీల్లో ఏ.త్రినాథరావు(ప్రథమ), టి.రామకృష్ణ(ద్వితీయ), ఎం.రాంబాబు(తృతీయ)
ఉలవల బస్తా పోటీల్లో టి.రామకృష్ణ(ప్రథమ), ఏ.త్రినాథరావు(ద్వితీయ), పి.కోటేశ్వరరావు(తృతీయ)
బంపర్లు పోటీలో బి.యోగేశ్వరరావు(ప్రథమ), ఏ.త్రినాథరావు(ద్వితీయ),
గూటాల(ముద్గర) పోటీల్లో వి.జగన్(ప్రథమ), ఎం.మణికంఠ (ద్వితీయ), బి.సురేష్(తృతీయ) స్థానం సాధించారు.