Share News

టెక్కలి డివిజన్‌లో చేర్చడంపై హర్షం

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:58 PM

ప్రజల ఇబ్బందుల్ని గుర్తించేది మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడేనని టీడీపీ మండల అధ్యక్షుడు పినకాన అజయ్‌ కుమార్‌ అన్నారు.

టెక్కలి డివిజన్‌లో చేర్చడంపై హర్షం
సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రుల చిత్ర పటాలకు పాలభిషేకం చేస్తున్న దృశ్యం

నందిగాం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రజల ఇబ్బందుల్ని గుర్తించేది మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడేనని టీడీపీ మండల అధ్యక్షుడు పినకాన అజయ్‌ కుమార్‌ అన్నారు. నందిగాం మండలాన్ని పలాస డివిజన్‌ నుంచి టెక్కలి డివి జన్‌లోకి మార్పు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడి చిత్ర పటాలకు పాలభిషేకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నందిగాం మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన పలాస రెవెన్యూ డివిజన్‌లో చేర్చి మండల ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసిందన్నారు. దీంతో ఎన్నికల సమయంలో మండల ప్రజలు తమ సమస్యను అచ్చెన్నాయుడికి వివరించడంతో ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయిందని సంతోషం వ్యక్తం చేశారు. తెంబూరు పీఏసీఎస్‌ అధ్యక్షుడు పోలాకి చంద్రశేఖర్‌, వంశధార డీసీ చైర్మన్‌ ఎం.బాలకృష్ణ, గొర్రెల పెంపకందారుల సహకార సంఘ చైర్మన్‌ కె.తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:58 PM