Share News

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:36 PM

చేపలవేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ‘భరోసా’ను స్వయంగా అందజేసేందుకు ఈ నెల 26న సీఎం చంద్రబాబునాయుడు బుడగట్లపాలెం విచ్చేస్తున్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
బుడగట్లపాలెంలో స్థల పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే ఈశ్వరరావు తదితరులు

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): చేపలవేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ‘భరోసా’ను స్వయంగా అందజేసేందుకు ఈ నెల 26న సీఎం చంద్రబాబునాయుడు బుడగట్లపాలెం విచ్చేస్తున్నారు. ఇందు కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ పర్మాన్‌ అహమ్మద్‌ఖాన్‌, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు.. బుడగట్లపాలెం, డి.మత్స్యలేశం గ్రామాలను సోమవారం సందర్శించారు. సభా వేదిక స్థలాన్ని పరిశీలించారు. బుడగట్ల పాలెం వద్ద సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో సభ నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలోనే హెలీప్యాడ్‌, వాహనాల పార్కింగ్‌ స్థలాలను కూడా పరిశీలించారు. ఎన్నికల హామీలో భాగంగా మత్స్యకార భరోసా రూ.20 వేలను ఈనెల 26న సీఎం చేతుల మీదుగా అందజేయను న్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.సాయిప్రత్యూష, తహసీల్దార్‌ బలగ గోపాల్‌, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, స్థానిక సర్పంచ్‌ అల్లుపల్లి రాంబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:36 PM