అందర్నీ పిలిచారు.. ఆలస్యంగా ప్రారంభించారు
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:41 PM
కొత్తూరు ఎంపీడీవో కార్యా లయ ఆవరణలో గురువారం ట్రైసైకిళ్ల పంపిణీలో దివ్యాంగులు అగచాట్లకు గురయ్యారు. కేవలం లబ్ధిదారులనే కాకుండా దివ్యాంగు లందరినీ పిలిపించి, కార్యక్రమం సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు.

కొత్తూరు, ఏప్రిల్ 10(ఆంధ్ర జ్యోతి): కొత్తూరు ఎంపీడీవో కార్యా లయ ఆవరణలో గురువారం ట్రైసైకిళ్ల పంపిణీలో దివ్యాంగులు అగచాట్లకు గురయ్యారు. కేవలం లబ్ధిదారులనే కాకుండా దివ్యాంగు లందరినీ పిలిపించి, కార్యక్రమం సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఇక్కడ తొమ్మిది మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. భవిత కేంద్రం, మండల విద్యాశాఖ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభంకావడంతో తల్లిదండ్రులతో పాటు వచ్చిన దివ్యాంగులు ఎండతీవ్రతకు అవస్థలకు గురయ్యారు. టెంట్ల కింద వేడిగా లులకు తట్టుకోలేక చెట్లకింద, భవనాల కిందకు వెళ్లాల్సివచ్చింది. ట్రైసైకిళ్లు మంజూరైన వారిని పిలిపించి అందజేస్తే సరిపోతుందని, అధికారులు దివ్యాంగులందరినీ పిలిపించి ఇబ్బందులుపాలుచేశారని పలువురు తల్లిదండ్రులు వాపోయారు. కాగా భవితసిబ్బంది తమతో సమాలోచన చేయకుండా ట్రైసైకిళ్లు మంజూరైన పిల్లను తెప్పించి మిగిలిన వారిని పిలవకుండా ఉండిఉంటే బాగుండేదని ఎంఈవో గోవిందరావు తెలిపారు.ఎండ తీవ్రతకు దివ్యాంగులు ఇబ్బందులకు గురవడం వాస్తవమేనని చెప్పారు.కార్యక్రమంలో ఎంఈవో గోవిందరావు, టీడీపీ నాయకలు అగతముడి అరుణకుమార్, లక్ష్మణరావు, పెద్దిన అమర్, లక్ష్మీనారాయణనాయుడు, టొంపల తిరుపతిరావు పాల్గొన్నారు.