Share News

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:56 PM

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటే ప్రశాతంగా ఉంటారని మైసూర్‌ దత్త పీఠం ఉత్తరాధికారి విజయా నంద్‌ తీర్థ స్వామిజీ తెలిపారు.

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి
ప్రవచనాలు చెబుతున్న స్వామీజీ

మెళియాపుట్టి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటే ప్రశాతంగా ఉంటారని మైసూర్‌ దత్త పీఠం ఉత్తరాధికారి విజయా నంద్‌ తీర్థ స్వామిజీ తెలిపారు. బుధవారం పెద్దపద్మాపురంలో ఏర్పాటు చేసిన సదస్సలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించా లన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రేమ, జ్ఞానం, ప్రశాంతత ఉండాలన్నారు. కార్యక్రమంలో శ్రీధర్‌, కోటేశ్వరావు,వసంత్‌,సత్యం భక్తులు తదితరులు ఉన్నారు.

నందిగాం: దిమ్మిడిజోలలో మైసూర్‌ దత్త పీఠం ఉత్తరాధికారి విజయా నంద్‌ తీర్థ స్వామిజీ పర్యటించారు. గ్రామస్థులు, దత్త వలంటీర్లు స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. స్వామీజీ భక్తులకు అనుగ్రహబాసన చేస్తూ ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. అంతకుముందు దత్త భక్తులు నగరసంకీర్తన నిర్వహించి అణగాష్టమి వ్రతాన్ని వందలాదిమంది భక్తులచే నిర్వహించారు. కార్యక్రమంలో నారాయణరావు, నిర్వీశ్యానంద స్వామీజీ, సలాన కృష్ణారావు, కూర్మారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 11:56 PM