Share News

స్వచ్ఛాంధ్రలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:20 AM

స్వచ్ఛాంధ్రలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేలు అన్నారు. శనివారం పలు ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిం చారు. ర్యాలీలు, అవగాహన సదస్సులు చేపట్టారు.

స్వచ్ఛాంధ్రలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి
నరసన్నపేట: పంచాయతీ కార్మికులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

స్వచ్ఛాంధ్ర ప్రతీ ఒక్కరి లక్ష్యం కావాలి

అరసవల్లి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్ర ప్రతీ ఒక్కరి లక్ష్యం కావాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. నగరంలోని డీసీసీబీ కాలనీలో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవడం ద్వారా నగరాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసాదరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

స్వచ్ఛ ఎచ్చెర్లను సాధిద్దాం: ఎన్‌ఈఆర్‌

ఎచ్చెర్ల, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఎచ్చెర్లను సాధించే దిశలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఎచ్చెర్లలో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు పరిసరాలు, కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించా లన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద మొక్కలు నాటా రు. అధికారులు, విద్యార్థులు, కూటమి నేతలతో కలిసి ర్యాలీ నిర్వహిం చారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, టీడీపీ జిల్లా మాజీ అధ్య క్షుడు చౌదరి నారాయణమూర్తి, కళింగ కారొ్పోరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, నారాయణపురం ప్రాజెక్ట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు, కూటమి నేతలు బెండు మల్లే శ్వరరావు, సంపతిరావు నాగేశ్వరరావు, మెండ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రత అందరి బాధ్యత: బగ్గు

నరసన్నపేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర నిర్వహించారు. మొక్కలు నాటి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, ఐడీసీఎస్‌ పీవో శోభారాణి, ఏవో సూర్యకుమారి, మేజర్‌ పంచాయతీ ఈవో ద్రాక్షాయిణి, కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పాగోటి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:20 AM