Share News

ప్రతి ఇంటికి పథకాలు అందాలి

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:26 PM

):ప్రతిఇంటికి కూటమి ప్రభుత్వసంక్షేమ పథకాలు అందాలని రాష్ట్ర గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. సోమవారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంనిర్వహించారు

 ప్రతి ఇంటికి పథకాలు అందాలి
మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర

పలాస, జూలై28(ఆంధ్రజ్యోతి):ప్రతిఇంటికి కూటమి ప్రభుత్వసంక్షేమ పథకాలు అందాలని రాష్ట్ర గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. సోమవారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంనిర్వహించారుఈసందర్భంగా మాట్లాడుతూ వైసీపీ హయాం లో భయానకమైన పాలన ప్రజలు చూశారని, ప్రతిపక్ష నాయకులపై ప్రదర్శించిన దాష్టీకం ప్రజలు మరచిపోలేదన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన తీరు విమర్శలకు దారితీసిందన్నారు. ఆయనకు ఆపరేషన్‌ జరిగి 24 గంటలు కాకముందే వాహనంలో 18 గంటలపాటు తిప్పారని గుర్తుచేశారు. వైసీపీ చేసిన రూ.లక్షలకోట్లు అప్పులు శాపంగా మారాయని తెలిపారు. వైసీపీ హయాంలో వెళ్లి పోయిన లులూ వంటి కంపెనీలు సైతం విశాఖ, విజయవాడలో మాల్స్‌ నిర్మించ డానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.ఎమ్మెల్యే గౌతు శిరీష వైసీపీ పాలనలో కార్యకర్తలు పడిన ఇబ్బందులు, అవమానాలు వివరించారు.

కుంభకోణాలు బయటపడుతుండడంతో విష ప్రచారం

వైసీపీ పాలనలో చేసిన కుంభకోణాలు బయట పడుతుండడంతో కూటమి ప్రభుత్వంపై కూడగట్టుకొని విషప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలి పారు.పలాసలో విలేకరులతో మాట్లాడుతూ గంజాయి పండించే రైతులను గుర్తిం చి వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు వారికి ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి అవకాశాలు కల్పించామన్నారు.శాటిలైట్లు, డ్రోన్ల సహాయంలో సాగుకేంద్రాలు గుర్తిం చామని,చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ఎక్కడికక్కడే కట్టడి చేశామన్నారు. సుపరిపాలన లో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 85లక్షల గృహాలకు వెళ్లామని చెప్పారు. ఆగస్టులో అన్నదాత సుఖీభవ కింద రైతులకు మొ దటివిడతగా రూ.ఏడువేలు ఖాతాలో జమచేస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో పలాసలో గౌతు శిరీషకు కూడా ఇబ్బందులుపెటారని, నల్లబొడ్లూరు కొండ, సూది కొండలను బోడి కొండలు చేశాని, అవన్నీ పరిశీలిసున్నామని, వీటిపైవిచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, టీడీపీ రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, చౌదరి బాబ్జి పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 11:27 PM