ప్రతీ ఇంటికి తాగునీరివ్వాలి: ఎన్‌ఈఆర్
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:22 AM
ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ప్రతీ ఇంటికి తాగునీరు సరఫరా చేయడమే లక్ష్యమని, ఈ దిశగా చర్య లు తీసుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
రణస్థలం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ప్రతీ ఇంటికి తాగునీరు సరఫరా చేయడమే లక్ష్యమని, ఈ దిశగా చర్య లు తీసుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జల్‌జీవన్ మిషన్ పనులపై సంబంధిత అధికా రులతో సమీక్షించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఈ దుర్యోధనరావు, పలువురు అధికా రులు పాల్గొన్నారు.